Site icon syeraa

చక్కటి తీపి కబురు చెప్పిన ఆర్ ఆర్ ఆర్ మూవీ టీమ్

ఎప్పుడు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న ఆర్‌ఆర్‌ఆర్ మూవీ అప్డేట్ రానే వచ్చింది. ఈ చిత్రం షూట్ కొద్ది రోజుల క్రితం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైన విషయం తెలిసిందే ప్రస్తుతానికి అయితే రెండు పాటలు మినహా, మిగిలిన షూట్ పూర్తి చేసుకున్న విషయాన్నీ తెలియజేశారు ఈ చిత్రం టీమ్ ఇంకో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ఇద్దరూ రెండు భాషలకు డబ్బింగ్ కూడా చేశారు. పాన్ ఇండియన్ చిత్రాలలో ఒకటిగా పేరుపొందిన ఆర్ఆర్ఆర్ ను రాజమౌలి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అలియా భట్ మరియు అజయ్ దేవగన్ ముఖ్య పాత్రల్లో నటించారు. కీరవణి సంగీతం అందిస్తున్నారు. తొందర్లోనే విడుదల తేదీని కూడా ప్రకటిస్తారు అని తెలుస్తోంది.

Exit mobile version