Site icon syeraa

విడుదల తేదీని వాయిదా వేసుకుంటున్న కొత్త చిత్రాలు

మరోసారి కరోనా ప్రభావం టాలీవుడ్లో విడుదలకు సిద్ధమైన కొత్త చిత్రాలు పై పడింది. ఇప్పుడు ఒక సినిమా తరువాత ఇంకో సినిమా వాయిదా వేస్తూ వస్తున్నారు సినీ నిర్మాతలు ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో కరోనావైరస్ కేసులు అధికం బయటపడటం తో ప్రభుత్వాలు ఏదైనా నిర్ణయం తీసుకుంటే నిర్మాతలకి భారీగా నష్టం వాటిల్లుతుందని ముందుగానే విడుదల తేదీని ప్రకటించిన సినిమాలు ఇప్పుడు వాయిదా పడుతున్నాయి. ముందుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ మూవీ విడుదలను వాయిదా వేస్తూనట్లు మీడియా ముందట తెలిపారు. అలాగే నాని హీరోగా వస్తున్న టెక్ జగదీష్ చిత్రం కూడా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు హీరో నాని. అదే విధంగా
రానా దగ్గుబాటి హీరోగా వేణు ఉడుగుల ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న విరాటప‌ర్వం కూడా వాయిదా వేస్తున్నట్లు సోషల్ మీడియా ట్విట్టర్లో తెలియజేశారు. చూస్తూ ఉంటే త్వరలో పెద్ద హీరోల చిత్రాలు కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Exit mobile version