Site icon syeraa

కనులు విందుగా రామ్ చరణ్ బర్త్ డే పోస్టర్లు

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య చిత్రంపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి.
మెగాస్టార్ చిరంజీవి అలగే రామ్ చరణ్ కలిసి రాబోయే చిత్రం ఆచార్య చిత్ర బృందం ఈ రోజు రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ సందర్బంగా అదిరి పోయే పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఇందులో రామ్ చరణ్ సిద్ధ పాత్రలో కనిపించనున్నాడు. అలాగే నిన్న ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి రామరాజుగా తన లుక్ తో సినీ అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఈ రోజు విడుదల చేసిన సిద్ధగా తన లుక్ తో అందరినీ విస్మయానికి గురిచేశాడు. ఈ పోస్టర్లో రామ్ చరణ్ అలగే చిరంజీవి తుపాకులు పట్టుకొని నడవడం మనం చూడవచ్చు. ఈ పోస్టర్ విడుదల చేసిన మెగాస్టార్‌పై ప్రశంసలు కురిపించారు సినీ ప్రముఖులు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మే 13 న విడుదల కానున్న ఈ చిత్రాన్ని రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు.ఇందులో కాజల్ అగర్వాల్, సోను సూద్, రామ్ చరణ్, పూజా హెగ్డే, జిషు సేన్‌గుప్తా, సౌరవ్ లోకేష్, కిషోర్, తనీకెల్లా భరణి మరియు ఇతరులు ఉన్నారు. ఈ చిత్రానికి మణి శర్మ సంగీత దర్శకుడుగా చేస్తున్నారు.

Exit mobile version