Site icon syeraa

బాస్ చిరు చెప్పితే అందరు పాటించాల్సిందే

కరోనా వ్యాప్తి విలయ తాండవం చేస్తూ వస్తుంది. ఈ కరోనా కి అడ్డుకట్ట వేయడానికి మెగాస్టార్‌ చిరంజీవి ఒక అద్భుతమైన వీడియోను షేర్‌ చేశారు. కరోనా కట్టడికి మాస్క్ తప్పనిసరిగా ధరించండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మీ కుటుంబాన్ని, దేశాన్ని కూడా కాపాడండి అంటూ ట్విటర్‌లో ఒక వీడియోను ట్వీట్‌ చేశారు.

చిరునవ్వు ముఖానికి అందం. కానీ ఆ చిరునవ్వు కలకాలం నిలవాలంటే మాస్క్‌ ధరించాలంటు చిరు మెగా సందేశం ఇచ్చారు. ఇందులో నటి ఈషా రిబ్బా లిఫ్ట్ స్టిక్ వేసుకోవడం చిరు మాస్క్ ఇవ్వడం నెటిజన్స్ ను బాగా ఆకట్టుకుంది. అలాగే హీరో కార్తికేయ మీసం మెలేయడం వీరత్వం అనేది ఒకపుడు కానీ ఇపుడు మాస్క్‌ ధరించడం వీరుడి లక్షణం అంటూ మరో వీడియోను కూడా ఆయన షేర్‌ చేశారు. రానున్న రోజుల్లో కరోనా మరింత మహమ్మారిగా మారనుందన్న డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరికల నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించాలి అని చిరంజీవి కోరారు. దయచేసి అందరు ప్రాథమిక జాగ్రత్తలను పాటించడం మంచిది అంటూ చిరు స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. హీరో కార్తికేయ నటి ఈషా తన ఆలోచనలను పంచుకోగానే ముందుకొచ్చి ఈ వీడియో చేసినందుకు ధన్యవాదాలు చెప్పారు చిరు. మాస్క్ తప్పనిసరిగా ధరించండి.మిమ్మల్ని మీరు కాపాడుకోండి.మీ కుటుంబాన్ని, దేశాన్ని కాపాడండి అంటూ పోస్ట్ పెట్టారు మెగా స్టార్ చిరంజీవి.

Exit mobile version