Site icon syeraa

ఆర్ఆర్ఆర్ – రౌద్రం రణం రుధిరామ్ గురించి లేటెస్ట్ అప్డేట్స్

రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా రాబోయే పురాణ నాటక చిత్రం ఆర్ఆర్ఆర్ రౌద్రం రణం రుధిరామ్ విడుదల తేదీ ప్రకటించినప్పటి నుండి ఈ చిత్రం మీద ఎంతో ఆసక్తి నెలకొంది. ఈ పాన్-ఇండియా చిత్రంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్ టి రామారావు, అలియా భట్ మరియు అజయ్ దేవ్‌గన్ తదితరులు ఉన్నారు. ఎస్.ఎస్.రాజమౌలి రచన మరియు దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారతదేశ స్వాతంత్ర్య సమరయోధులైన – అల్లూరి సీతారామ రాజు మరియు కొమరం భీమ్ చుట్టూ ఉంటూ బ్రిటిష్ అలాగే హైదరాబాద్ నిజాంకు వ్యతిరేకంగా సాగే పోరాట యోధుల కల్పిత కథ. అలియా భట్‌ను తన చిత్రానికి ప్రధాన కధానాయికగా తీసుకోవడం గురించి మాట్లాడుతూ, ఎస్.ఎస్.రాజమౌళి, హిందూస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, నాకు జూనియర్ ఎన్‌టి రామారావు అలాగే రామ్ చరణ్ మధ్య నిలబడగల ఒక నటి అవసరం ఈ కథకు, వీరిద్దరూ చాలా ప్రతిభావంతులైన నటులు. అదే విధంగా అలియా కూడా మంచి నటి కాబట్టి ఈ చిత్రం కోసం తీసుకోవలసి వచ్చింది అని చెప్పుకొచ్చారు.

కరోనావైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్త లాక్డౌన్ గురించి మాట్లాడుతూ, ఈ నెలలో జరగాల్సిన అలియాతో షూట్ లాక్ డౌన్ కారణంగా షెడ్యూలు రద్దు చేయబడింది. మేము తిరిగి పని చేయాల్సిన అవసరం ఉంది తేదీలు మరియు షెడ్యూల్స్ త్వరలో ప్రకించనున్నారు అని చెప్పుకొచ్చారు. నేను ఆమెతో పనిచేయడానికి ఎదురు చూస్తున్నాను అని రాజ్ మౌళి చెప్పుకొచ్చారు. ఆర్‌ఆర్‌ఆర్‌లో రామ్ చరణ్, జూనియర్ ఎన్‌టి రామారావులతో అలియా భట్ మధ్య ట్రై యాంగిల్ లవ్ స్టోరీ ఉండదు అని చెప్పారు.

ఈ చిత్రంలో అలిసన్ డూడీ మరియు రే స్టీవెన్సన్ మెయిన్ విలన్స్ గా నటించనున్నరు. అజయ్ దేవగన్ పాత్ర చాలా స్పెషల్ గా ఉంటుంది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ ‘కొమరం భీమ్’ పాత్రకు హాలీవుడ్ నటి ఒలివియా మోరిస్, జూనియర్ ఎన్టీఆర్ సరసన కనిపించనున్నారు.

బాహుబలి 2 ది కంక్లూజన్ తరువాతరాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్. ఈ చిత్రం 2021 విడుదల చేయాలని అనుకున్నారు.

Exit mobile version