ఎక్కడో మొగల్తూరు లో ఉదయించిన శివశంకర్ వరప్రసాద్ నేడు మెగాస్టార్ గా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో అన్నయ్యగా మిగిలిపోయిన చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు భారీ స్థాయిలో వస్తున్నాయి. అది కూడా ఈ రోజు వినాయకచవితి కాబట్టి, రెండు పండగలు ఒకేసారి వచ్చినట్టు అభిమానుల నుండి సెలబ్రిటీల వరకు అందరూ మెగాస్టార్ చిరంజీవి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం ఆచార్య ఫస్ట్ లుక్ వస్తోంది. ఈ సందర్భంగా అభిమానులు కూడా ప్రత్యేక పుట్టినరోజు ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా చిరు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన తెలుగు స్టార్స్ అలాగే రాజకీయ నాయకులు.
Wishing you a very Happy Birthday @KChiruTweets garu! You’ve been an inspiration to an entire generation and will continue to be! Great health and happiness to you always sir😊🙏 pic.twitter.com/S7XpdFRWoM
— Mahesh Babu (@urstrulyMahesh) August 22, 2020
Wishing THE MEGASTAR @KChiruTweets Garu a Very Happy Birthday. May you celebrate many such joyous birthdays in the years to come sir 🙏🏻
— Jr NTR (@tarak9999) August 22, 2020
అంచెలంచెలుగా ఎదుగుతూ, సినీ అభిమానుల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని, సినీరంగంలో చిరకీర్తినీ సంపాదించుకున్న శ్రమజీవి @KChiruTweets గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ స్వయంకృషి, సామాజిక సేవాస్ఫూర్తి యువతకు ఆదర్శం. మీరు సంపూర్ణ ఆయురారోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను pic.twitter.com/bMSRxmZU1V
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) August 22, 2020
చిరంజీవి నాకు మంచి మిత్రుడు, అతని పేరులోనే ఉంది చిరంజీవి అంటే ఆంజనేయస్వామి. అంటే ఎల్లకాలము చిరంజీవివై వర్ధిల్లుగాక. అంటే నిండు నూరేళ్ళు ఉత్సాహంగా కుటుంబ సభ్యులతో పుట్టినరోజు జరుపుకోవాలని ఆ షిరిడీ సాయినాథున్ని కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ మై డియర్ ఫ్రెండ్. @KChiruTweets pic.twitter.com/TQ4CqAkGgc
— Mohan Babu M (@themohanbabu) August 22, 2020