Site icon syeraa

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా అనేక రాష్ట్రాలు థియేటర్స్‌ను మూసివేస్తున్న నేపథ్యంలో తమ సినిమాను వాయిదా వేస్తున్నట్లు ఆర్ ఆర్ ఆర్ టీమ్ తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో మరో భారీ బడ్జెట్ చిత్రం పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రాధే శ్యామ్ చిత్రం కూడా వాయిదా పడింది అనే వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. మహేష్ బాబు సర్కారు వారి పాట, పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, వెంకటేష్, వరుణ్ తేజ్‌ల ఎఫ్ 3 సినిమాలు సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నాయి. దీంతో ప్రస్తుతం సంక్రాంతి బరి నుంచీ రాధేశ్యామ్ చిత్రం కూడా తప్పుకుంటుంది అని తెలుస్తుంది. చూడాలి ప్రస్తుతం ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన అనేది రాలేదు. రాధే శ్యామ్ చిత్రం జనవరి 14న విడుదలకు సిద్ధం అయినా విషయం తెలిసిందే. ఈ రూమర్స్ కి చెక్ పెట్టేందుకు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు అని తెలుస్తుంది.

Exit mobile version