Site icon syeraa

బిగ్ బాస్ షో నుంచి రవి ఎలిమినేట్ అవ్వడం షాకింగ్ న్యూస్ మరీ ?

తెలుగు బిగ్ బాస్ షో సీజన్ 5 లో ఎవరు ఊహించని షాకింగ్ ఎలిమినేషన్ ఈ రోజు(ఆదివారం) జరగబోతుందనే వార్త ఎవరూ నమ్మలేక పోతున్నారు. తెలుగులో ప్రముఖ మెల్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ రవి ఈ రోజు బిగ్ బాస్ షో కి గుడ్ బై చెప్పబోతున్నాడు. రవి కి బయట ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉన్న కానీ తనకి ఈ వారం తక్కువ ఓట్లు వచ్చాయి అని తెలుస్తుంది. రవి బిగ్ బాస్ షో విన్నర్ అనే అంచనాలకు వచ్చారు అతని అభిమానులు. కానీ టాప్ 5 లో కుడా ఉండకపోవటం వారు ఊహించలేకపోతున్నారు.

రవి ఈ షోలో ఫేవరెట్ కాంటేస్తెంట్ అందరికీ తెలుసు కానీ అతని ప్రయాణం ఇప్పుడు ముగిసింది. కాజల్, మానస్, ప్రియాంక మరియు సిరి వంటి వాళ్లు తక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వారు ఇంకా షోలో కొనసాగటం కానీ రవి బయటకు వెళ్లడం షాక్‌గా మారింది. రవి షో నుండి ఎలిమినేట్ అయ్యారు అనే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ వార్త బయటకు పొక్కగానే షో రిగ్గింగ్ అయిందని, రవి లాంటి యాంకర్ బయటకు ఎలా వెళ్తాడని సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. రవికి అతి తక్కువ ఓట్లు రావడం, మసాలా అందించకపోవడంతో ఆయనను ఈ షో నుంచి తప్పించినట్లు షో ఇన్‌సైడర్లు చెబుతున్నారు. చూడాలి తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 విజేతగా ఎవరూ నిలిస్తారో మరి కొద్దీ వారాలు వేచి చూడాలి.

Exit mobile version