Site icon syeraa

శుభవార్త చెప్పిన జూనియర్ ఎన్టీఆర్, అభిమానులు హ్యాపీ

నందమూరి అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు శుభవార్త తెలియజేశారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. కొద్ది రోజుల క్రితం తనకి కోవిడ్ పాజిటివ్ వచ్చిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ రోజు తనకి కోవిడ్ నెగిటివ్ అంటూ శుభవార్త చెప్పారు. తనకి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్స్ కి కృతజ్ఞతలు తెలిపారు. అందరిని ఈ కోవిడ్ నుంచి జాగ్రత్తగా ఉండాలి అని మాస్క్ తప్పనిసరిగా ధరించాలి అని చెప్పారు. కొన్ని రోజుల కింద ఎన్టీఆర్ కరోనా బారిన పడ్డారు. అప్పట్నుంచే క్వారంటైన్‌లోనే ఉన్నారు ఎన్టీఆర్. హైదరాబాద్ లోని తన ఇంట్లోనూ ఉంటూ ట్రీట్మెంట్ తీసుకున్నారు. కరోనా వచ్చిందనే విషయం తెలుసుకున్న తర్వాత అభిమానులు చాలా కంగారు పడ్డారు. ఆయన ఆరోగ్యం త్వరగా నయం కావాలని దేవుళ్లకు పూజలు కూడా చేసారు. అభిమానులు కంగారు పడుతున్నా కూడా తాను మాత్రం చాలా ధైర్యంగా ఉన్నాడు యంగ్ టైగర్. తాజాగా అభిమానుల ప్రార్థనలు ఫలించాయి. వారం రోజుల్లోనే ఈయన తిరిగి కోలుకున్నారు. తాజాగా తనకు నెగిటివ్ వచ్చిన విషయాన్ని స్వయంగా ట్వీట్ చేసారు ఎన్టీఆర్. ఈ ట్వీట్ చూసి సంతోషంలో మునిగిపోయారు ఫ్యాన్స్. త్వరలో ‘రౌద్రం రుధిరం రణం’ సినిమాలో కొమరం భీమ్‌గా పలకరించనున్న ఎన్టీఆర్.

Exit mobile version