Site icon syeraa

మొత్తం షూటింగ్ పూర్తి చేసుకున్న ఆర్ఆర్ఆర్ బృందం

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) ఈ మధ్యనే చిత్రబృందం ఉక్రెయిన్ షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే మిగతా ప్యాచ్ వర్క్ షూటింగ్ మొత్తం పూర్తి కావడానికి కొంత సమయం పడుతుంది దర్శక నిర్మాతలు చెప్పిన విషయం తెలిసిందే. ఈ రోజు ఆర్ఆర్ఆర్ అఫిషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా మొత్తం షూటింగ్ పూర్తి చేసుకున్న విషయాన్నీ తెలియజేశారు. రెండు చిన్న చిన్న షాట్స్ తప్ప మిగతా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది అని తెలిపారు. త్వరలోనే ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటిస్తారు అని తెలుస్తుంది. మొదటగా ఈ సినిమాని అక్టోబర్ 13న విడుదల చేయాలని అనుకున్నారు కానీ ఇప్పుడు సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా విడుదల గురించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో రే స్టీవెన్సన్, అజయ్ దేవ్ గన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Exit mobile version