ఆర్ఆర్ఆర్ టీమ్ మూవీ రిలీజ్ గురించి ఒక స్పష్టత ఇస్తున్నారు, జనవరి 8, 2021 న విడుదల చేయాలని అనుకున్నారు కానీ కరోనా వ్యాప్తి లాక్ డౌన్ కారణంగా అనుకున్నా ప్రణాళిక ప్రకారం ఆర్‌ఆర్‌ఆర్ విడుదల చేయకపోవచ్చు అని జనవరి 8న రిలీజ్ ప్రకటించినప్పటికీ ఈ చిత్రం వేసవికి నెట్టబడవచ్చు అని. ఈ మూవీ చాలా పెద్ద బడ్జెట్ తో తెరకెక్కుతున్న కారణంగా నిర్మితలు ఈ చిత్రం రిలీజ్ గురించి ఆలచించాల్సిన అవసరం ఉంది అని , అయితే తమ చిత్రాన్ని వేసవిలో విడుదలకు ప్లాన్ చేస్తున్నట్లు వస్తున్న ఊహాగానాలుకు ఒక స్పష్టత వచ్చింది .
అయితే లేటెస్ట్ గా ఆర్‌ఆర్‌ఆర్ విడుదల తేదీ గురించి ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాత డివివి దానయ్య కూడా ఒక స్పష్టత ఇచ్చారు. ఈ చిత్రం తప్పకుండా జనవరి 8 న విడుదల అవుతుందని చెప్పారు. చిత్రం యొక్క షెడ్యూల్ ప్రణాళిక చేయబడింది అని లాక్డౌన్ ఎత్తివేసిన తరువాత షూట్ ప్రారంభమవుతుంది అని ఆర్‌ఆర్‌ఆర్ తదుపరి షెడ్యూల్ గండిపేటలోని ప్రత్యేక సెట్‌లో ప్రారంభమవుతుంది అని ఈ షెడ్యూల్ ముగిసిన వెంటనే, యూనిట్ పూణేకు వెళ్తుంది అని. ఈ షెడ్యూల్‌లో అలియా భట్ సెట్స్‌లో చేరనున్నారు అని. తన ఏప్రిల్ తేదీలు వృధా అవుతున్నందున నటి ఇప్పటికే కొత్త తేదీలను కేటాయించింది అని చెప్పుకొచ్చారు. ఆర్‌ఆర్‌ఆర్ యొక్క వీఎఫ్‌ఎక్స్ పని వేగంగా జరుగుతోంది అని కూడా చెప్పుకొచ్చారు. ఆర్‌ఆర్‌ఆర్ జనవరి 8, 2021 న తప్పకుండా విడుదల అవుతుందని అని దానయ్య అంటున్నారు.
ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 400 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించబడుతుంది, అజయ్ దేవ్‌గన్, సముతిరాకణి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
