ఒక సంవత్సరం క్రితం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ అనే చిత్రాన్ని ప్రారంభించారు అనేది అందరికీ తెలిసిన విషయమే. అప్పుడు అల్లు అర్జున్ బర్త్ డే పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ చిత్రానికి టేగ్ లైన్ కనుబడుటలేదు అని కూడా పెట్టారు. కానీ ఆ ప్రాజెక్ట్ ఎప్పుడూ సెట్స్ పైకి వెళ్లనుంది అనే దానికి సమాధానం ఇంకా ప్రకటించలేదు. ఇప్పుడు బన్నీ పుష్ప చిత్రం తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తాడు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అలాగే, దర్శకుడు వేణు శ్రీరామ్ వకీల్ సాబ్‌తో బిజీగా ఉండటంతో, ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు అప్పుడే సెట్స్ పైకి వచ్చే అవకాశాలు లేవని చాలా మంది అంటున్నారు. కానీ ఇప్పుడు, వేణు శ్రీరామ్ స్వయంగా తనే, ఈ ప్రాజెక్ట్ పక్రీయ కొనసాగుతోందని, అతను అల్లు అర్జున్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నానని చెపుతున్నారు. ఈ ప్రాజెక్ట్ తప్పనిసరిగా పట్టాలు ఎక్కుతుందని, చివరిగా స్క్రిప్ట్ ఫార్మాలిటీలను ఆయన పరిశీలిస్తున్నారని, త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన అన్ని విషయాలు ఖరారు అవుతాయని వేణు చెప్పారు. ఈ చిత్రం ఎప్పుడు షూటింగ్ సెట్స్ పైకి వెళ్లనుంది అనే దానికి మాత్రం ఇంకా ప్రకటించలేదు.
