ఓ వినూత్నమైన కథతో ఎవరూ అంచనా వేయలేని ట్విస్ట్‌లతో ఆసక్తికరంగా థ్రిల్లర్ జోనర్‌లో వినూత్న కాన్సెప్ట్‌తో రూపొందుతున్న చిత్రం ‘ఏప్రిల్ 28 ఏం జరిగింది ‘. ఈ చిత్రం నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన టు థౌజండ్ ఎట్లోనే.. లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేసారు చిత్ర బృందం. వీరాస్వామి.జి. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఏప్రిల్ 28 ఏం జరిగింది’. రంజిత్, షెర్రీ అగర్వాల్ జంటగా వీజీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం అన్ని పనులను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే హరిప్రసాద్ జక్కా అందించారు. అజయ్, రాజీవ్ కనకాల, తనికెళ్ల భరణి, చమ్మక్ చంద్ర, తోటపల్లి మధు తదితరులు నటించిన ఈ చిత్రాన్ని మార్చి 5న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం.
రాహుల్ సిప్లిగంజ్ పాడిన టు థౌజండ్ ఎట్లోనే లిరికల్ వీడియో సాంగ్ అదుర్స్
