Site icon syeraa

లాహే లాహే పాటలో చిరు స్టెప్స్ అధ్బుతంగా ఉండబోతున్నాయి

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆచార్య మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్ చరణ్ ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నిన్న ఈ చిత్రానికి సంబంధించిన ‘లాహే లాహే’ పాట ప్రోమో విడుదల చేయడం జరిగింది. ఇందులో చిరు స్టెప్స్ కి అద్భుతమైన స్పందన వస్తోంది .చిరు తన డాన్స్ తో అభిమానులను మరోసారి ఆకట్టుకున్నాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మణి శర్మ నేపథ్య సంగీతం చాలా బాగుంది. పూర్తి పాట ఈ రోజు సాయంత్రం 4.05 గంటలకు విడుదల కాబోతోంది. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. అలాగే పూజా హెగ్డే రామ్ చరణ్ జంటగా నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ అలాగే మ్యాట్ని ఎంటైర్ టైన్మెట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 13 మే 2021 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్దమవుతోంది.

Exit mobile version