Site icon syeraa

జయలలితగా నటి కంగనా రనౌత్, అచ్చం ఆమెలాగే

తమిళనాడు దివంగత మాజీ సిఎం జె జయలలిత జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రం తలైవి
ఎఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తలైవి చిత్రంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ జయలలితగా నటిస్తుంది. తలైవి షూటింగ్ ఫార్మాలిటీలను పూర్తి చేసుకుంటోంది.తలైవి మూవీ మేకర్స్ కంగనా జయలలిత గా రాజకీయ నాయకురాలుగా ఉన్న చిత్రాన్ని విడుదల చేశారు. అచ్చం ఆమె పోలిక లాగా ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు అభిమానులు.ఈ చిత్రంలో హీరో అరవింద్ స్వామి జయ గురువు గా సీనియర్ నటుడు మరియు మాజీ తమిళనాడు సిఎం ఎంజిఆర్ పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని తమిళ్ మరియు హిందీ ద్విభాషా కోసం జివి ప్రకాష్ కుమార్ సౌండ్‌ట్రాక్ కంపోజ్ చేస్తున్నారు. టి-సిరీస్, విబ్రీ మీడియా మరియు కర్మ మీడియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని చేస్తున్నాయి. వచ్చే ఏడాది వేసవిలో తలైవి తెరపైకి రానుంది.

Exit mobile version