Site icon syeraa

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడివి శేష్ ఫస్ట్ లుక్

మన టాలీవుడ్ కి దొరికిన హాలీవుడ్ లాంటి హీరో ఎవరు అంటే అడివి శేష్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన హీరోగా చేసిన ప్రతి సినిమా తెలుగు ప్రేక్షకుడు వావ్ అనేటట్టూ ఉంటాయి. ఈ రోజు అడివి శేష్ పుట్టినరోజు సందర్భంగా, అతని రాబోయే చిత్రం మేజర్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు హీరో మహేష్ బాబు. ఎన్‌ఎస్‌జి కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో శేష్‌ను అద్భుతమైన పోస్టర్ విడుదల చేసారు చిత్ర బృందం. ఈ చిత్రం మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ అతని వీరోచిత జీవిత కథ ఆయన దేశం కోసం చేసిన త్యాగం. 26/11 ముంబై టెర్రర్ దాడుల సమయంలో సందీప్ జీవితపు క్షణాలు తెరకెక్కిస్తున్నారు. ఈ మేజర్ పాన్-ఇండియన్ చిత్రంగా తయారవుతోంది. దీనిని మహేష్ బాబు జీ ఎం బి ఎంటర్టైన్మెంట్స్, సోనీ పిక్చర్స్ కలిసి ఈ మూవీనీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ ప్రతిష్టాత్మక బయోపిక్‌కి శశి కిరణ్ టిక్కా దర్శకత్వం వహిస్తున్నారు. షోబితా ధులిపాల, సాయి మంజ్రేకర్ మహిళా కథానాయికలుగా కనిపించనున్నారు.

Exit mobile version