Site icon syeraa

సబ్ కలెక్టర్ పాత్రలో మాస్ మహారాజ రవితేజ?

మాస్ మహా రాజ రవి తేజ 68 వ చిత్రం అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన విషయం తెలిసిందే అయితే నిన్న ఈ చిత్రం టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. రామారావు ఆన్ డ్యూటీ టైటిల్ అనౌన్స్ కు నిన్న సోషల్ మీడియాలో భారీ స్పందన వచ్చింది. ఈ యాక్షన్ డ్రామాలో మాస్ మహారాజ్ ప్రభుత్వ అధికారిగా కనిపిస్తారని కూడా పోస్టర్లో చూస్తేనే తెలుస్తుంది. రవితేజ స్టైలిష్ లుక్ లో అందంగా ఉన్నారు.
అయితే ఒక తాజా ఇంటర్వ్యూలో, రామారావు ఆన్ డ్యూటీ డైరెక్టర్ శరత్ మాండవ ఈ చిత్రంలో రవితేజ సబ్ కలెక్టర్ పాత్రలో నటించనున్నట్లు వెల్లడించారు. అయితే ఇందులో రవి తేజ పాత్ర చమత్కారంగా అధ్బుతంగా ఉంటుందనీ అన్నారు. రామారావు ఆన్ డ్యూటీ 1995 లో జరిగిన సంఘటన ఆధారంగా సెట్ చేయబడింది. ఆ కాలంలో జరిగిన నిజమైన సంఘటనల నుండి ప్రేరణ పొందింది. ఈ సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో దివ్యన్షా కౌశిక్ హీరోయిన్ గా, ఆర్టీ టీమ్‌వర్క్స్ బ్యానర్లో సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Exit mobile version