చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతోన్న ఆచార్య చిత్రం ప్రకటించినప్పటి నుండి, ఈ చిత్రం కథ గురించి అనేక ఊహాగానాలు వచ్చాయి. పురాతన దేవాలయాల కోసం నక్సలైట్ గా మారిన ప్రొఫెసర్ దేవాలయాలు కోసం పోరాడుతాడు అని ఈ చిత్రం గురించి అనేక వార్తలు వచ్చాయి.
అయితే లేటెస్ట్ గా ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రికకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో చిరు ఆచార్యపై కొద్దిగా స్పష్టత ఇచ్చారు. ఈ చిత్రం ఒక సామాజిక-రాజకీయ వినోదం అని, ఇది సహజ వనరులను పరిరక్షించడానికి మనిషి చేసే పోరాటాన్ని ప్రదర్శిస్తుంది అని చెప్పు కొచ్చరు. ఇది శారీరకంగా అలాగే మేధోపరంగా ఆసక్తి కలిగించే పాత్ర చిరు చెప్పారు.
కొరటాల శివ మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ లాగ వాణిజ్య వినోదాల మాదిరిగా ఆచార్య కూడా చాలా బలమైన సందేశాన్ని అందిస్తుందని అందరూ అనుకుంటున్నారు.రామ్ చరణ్ ఈ చిత్రానికి నిర్మాత అదే విధంగా ఈ మూవీలో రామ్ చరణ్ కూడా నటిస్తూనట్లు సమాచారం. మని శర్మ సంగీతం అందించనున్నారు.2021 లో మూవీ రిలీజ్ అవుతుందని లేటెస్ట్ సమాచారం.
