నేచురల్ స్టార్ నాని ఒకొక్క సినిమాతో కెరీర్లో గొప్ప నటుడు గా ఎన్నో విజయాలు సాధిస్తూ మంచి సినిమాలు చేస్తున్నారు. నాని విరామం లేకుండా చిత్రాలు చేస్తూనే ఉన్నాడు. ప్రతి సంవత్సరం మూడు చిత్రాలను అందించాడు. ప్రస్తుతం శ్యామ్ సింఘా రాయ్ కోసం కోల్‌కతాలో షూటింగ్ జరుపుకుంటున్నారు. రాహుల్ సంకృత్యన్ దర్శకుడు, సాయి పల్లవి, కృతి శెట్టి కథానాయికలు చేస్తున్నారు. కోల్‌కతా షెడ్యూల్‌ను ప్రస్తుతం చేస్తున్నారు. ఈ రోజు నాని పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర బృందం ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ పోస్టర్లో హీరో నాని కొత్త తరహా గెట్ అప్ లో కనిపిస్తున్నాడు. శ్యామ్ సింఘా రాయ్ షెడ్యూల్ ఒక నెల పాటు ఉంటుంది, దానితో షూట్ యొక్క ప్రధాన భాగాలు పూర్తవుతాయి. నిహారికా ఎంటర్టైన్మెంట్ సమర్పణలో ఈ సంవత్సరం ఈ చిత్రం విడుదల అవుతుంది.
పేరు ….
శ్యామ్పూర్తి పేరు… pic.twitter.com/H1GU1o2VaO
— Nani (@NameisNani) February 24, 2021