Site icon syeraa

సరికొత్త గెటప్ లో హీరో శింబు గుర్తుపట్టలేనంతగా

దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం వెందు తనిందదు కాడు, ఎప్పుడూ రొమాంటిక్, స్టైలిష్ లుక్లో దర్శనమిచ్చే హీరో శింబు ఇప్పుడు సరికొత్త కోణంలో కనిపిస్తున్నాడు, స్వరకర్త ఎఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా ఈ ముగ్గురు కలయికలో వస్తున్న యాక్షన్ డ్రామా చిత్రం వెందు తనిందదు కాడు అనే టైటిల్‌తో నిన్న విడుదలైన ఈ ఫస్ట్ లుక్ చుస్తే ఎవరూ శింబు అని గుర్తు పెట్టలేరు. మాసిపోయిన దుమ్ము పట్టిన చొక్కా లుంగీ ధరించి, చేతిలో వెదురు కర్రను పట్టుకుని, శింబు నిరుపేదలా కనిపిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ తమిళనాడులోని తిరుచెందూర్‌లో ప్రారంభమవుతుంది. తరువాత చెన్నై నుంచి ముంబైకి వెళ్తుంది. ఇషారి కె గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Exit mobile version