Site icon syeraa

మాస్ మహా రాజ రవి తేజ సంక్రాంతి బరిలో విజేత?

మాస్ మహా రాజ రవి తేజ సినిమా అంటే ప్రతీ ఒక్కరికీ చూడాలనిపిస్తుంది ఎందుకంటే అంతని చిత్రాల్లో కామెడీ యాక్షన్ ఎమోషన్ అన్ని కలిపి కుటుంబ కథా చిత్రంగా ఉంటుంది. ఈ సంవత్సరం సంక్రాంతి బరిలో దిగిన మాస్ మహా రాజ విజేతగా నిలిచి నట్టు తెలుస్తోంది. ఈ రోజు పండుగ చివరి రోజు కనుమా కనుక ఈ సంక్రాంతి కి వచ్చిన చిత్రాల్లో ఎక్కువ వసూళ్లు సాధించిన చిత్రంగా క్రాక్ ఉన్నట్లు సమాచారం. ఈ సంవత్సరం నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. కోవిడ్ నిబంధనలతో సంబంధం లేకుండా ఈ చిత్రాన్ని చూడటానికి రెండు తెలుగు రాష్ట్రాల అభిమానులు బ్ర్మరథం పట్టినట్లు తెలుస్తోంది. క్రాక్, మాస్టర్, రెడ్, మరియు అల్లుడు అధర్స్ వంటి చిత్రాలు విడుదలయ్యాయి ఈ రేసును స్పష్టంగా గెలిచిన చిత్రం క్రాక్ అని కలెక్షన్స్ టాక్ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. ఈ రోజు రాంగోపాల్ వర్మ గారు కూడా తన ట్వీట్ ద్వారా దర్శకుడు గోపిచంద్ మలినేని కి అలాగే రవి తేజ కి పెద్ద విజయాన్ని అందుకున్న శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

Exit mobile version