రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ చిత్రంలో విలన్ పాత్రలో అద్భుతమైన నటన కనబరిచి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన నటుడు శాండల్‌వుడ్ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ తన ప్రతిష్టాత్మక యాక్షన్ థ్రిల్లర్ చిత్రం కోసం ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం యొక్క చివరి షెడ్యూల్ డిసెంబర్ 4 న ప్రారంభమవుతుండగా లేటెస్ట్ గా సుదీప్ తన సోషల్ మీడియా ట్విట్టర్ లో తన జిమ్‌లో తీసిన ఫోటో ఒకటి షేర్ చేసారు. అందులో బలమైన కండరాలు తిరిగి దృఢమైన శరీరాన్ని కలిగి ఉన్న ఫోటో ను పంచుకున్నారు. అతను కొంత గ్యాప్ తర్వాత పని చేస్తున్నానని అలాగే మంచి ఆహారం, మంచి జీవనశైలి మరియు క్రమశిక్షణ తన ఆకట్టుకునే మేక్ఓవర్ వెనుక కారణమని ఆయన వెల్లడించారు. ఈ చిత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది మీరు ఒకసారి చూడండి.
Gud food,,, a bit of decent lifestyle,,,n a lil Discipline,, isn’t bad after all ye!!.🥂🤗
Started work out again after a long gap. Courtesy: The climax part of #TheWorldOfPhantom ,,wch tired each one on set for almost a month.
Lookn forward to the last schedule.
Startn Dec 4th. pic.twitter.com/Wh80qzyaYF— Kichcha Sudeepa (@KicchaSudeep) November 26, 2020