సల్మాన్ ఖాన్ ఏ పోస్ట్ పెట్టిన అది కచ్చితంగా వైరల్ అవ్వవలసిందే ఎందుకంటే సల్మాన్ కి ఉన్న క్రేజ్ అటువంటిది మరి, ఇంతకీ విషయం ఏమిటి అంటే సల్మాన్ తన పన్వెల్ ఫామ్‌హౌస్‌లో ఈరోజు అంటే శుక్రవారం తనకి ఇష్టమైన ప్రేమ తో అల్పాహారం తీసుకున్నాడు. సల్మాన్ కు కొత్తగా దొరికిన ప్రేమ ఎవరు అని మీరు ఆలోచిస్తున్నట్లయితే..
ప్రేమ అంటే అది అతని గుర్రం. తన ఫామ్‌హౌస్‌లో తన గుర్రంతో అల్పాహారం ఆస్వాదిస్తున్న వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో సల్మాన్ పంచుకున్నాడు, ఆ గుర్రానికి ఆహారం ఇచ్చే ముందు సల్మాన్ కొన్ని ఆకులను తింటూ గుర్రానికి పెట్టడం ఈ వీడియో లో మీరు చూడవచ్చు. నా ప్రేమతో అల్పాహారం అని ఇన్స్ట్ గ్రామ్ లో ఈ పోస్ట్ సల్మాన్ పెట్టాడు. గుర్రం తినే గడ్డి ఆకులు సల్మాన్ తినడం వల్ల ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇటువంటి పోరాట సమయాల్లో ఆరోగ్యకరమైన అల్పాహారం అని అభిమానులు సల్మాన్ ఖాన్ పోస్ట్ కు రిప్లై ఇస్తున్నారు. మీరు కూడా ఒకసారి ఈ వీడియో చూడండి.
