రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి చేస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్ చాలా కాలంగా అభిమానులు ఆసక్తి గా ఎదురుస్తున్న చిత్రాల్లో ఈ చిత్రం ఒకటి. పాన్ ఇండియన్ చిత్రంగా విడుదలకు సిద్ధం అవుతుంది. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు కోమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలను పోషించారు. ఇద్దరు పాత్రలకు సంబంధించి ఇంట్రడక్షన్ టీజర్లు విడుదల చేసారు. అయితే జనవరిలో జరిగే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆర్‌ఆర్‌ఆర్ బృందం ఈ సందర్భంగా చిన్న టీజర్ లేదా ఇద్దరు కలిసి ఉన్న పోస్టర్ విడుదల చేయాలని భావిస్తున్నారు అని సమాచారం. ఈ చిత్రం దేశభక్తితో కూడిన చిత్రం కాబట్టి, గణతంత్ర దినోత్సవం కోసం అప్‌డేట్ ఇవ్వాలని మేకర్స్ నిర్ణయించారు అని తెలుస్తుంది. ఈ చిత్రం యొక్క తదుపరి షెడ్యూల్ జనవరి 4 నుండి ప్లాన్ చేయబడింది, అయితే రామ్ చరణ్ కరోనావైరస్ పాజిటివ్ గా పరీక్షించడంతో షెడ్యుల్ లో మార్పులు రావచ్చు . అయితే జనవరి 7 నుండి ఆర్ఆర్ఆర్ సెట్లలో చేరవచ్చు అని సమాచారం. ఆర్‌ఆర్‌ఆర్‌కు దసర 2021 విడుదల ఉంటుందని భావిస్తున్నారు.