నిహారికా చైతన్య ల పెళ్లి రాజస్థాన్ లోని ఉదయపూర్ లోని ఉదైవిలాస్ హోటల్ లో అంగరంగా వైభవంగా వివాహం రేపు (డిసెంబర్ 9) జరుగుతుంది. పెళ్లికి వచ్చిన ఆహ్వానితులందరూ ఇప్పటికే ఉదయపూర్ చేరుకున్నారు. వివాహానికి ముందు జరిగే వేడుకల్లో పాల్గొన్నారు. మొత్తం 120 మంది అతిథులను ఈ వివాహానికి ఆహ్వానించినట్లు సమాచారం. ఆహ్వానించబడిన వారందరికీ పట్టు వస్త్రాలు బహుమతిగా ఇచ్చారు. వారికి ఉదైలాస్ హోటల్లో వసతి కల్పించారు. సన్నిహిత కుటుంబ సభ్యులతో పాటు, చిత్ర పరిశ్రమకు చెందిన నిహారికాకు మంచి స్నేహితులు అయిన లావణ్య త్రిపాఠి రితు వర్మ కూడా ఉదయపూర్ లో అడుగుపెట్టారు. ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు వీడియోస్ కుటుంబ సభ్యులు తమ సోషల్ మీడియా ట్విట్టర్ ఇన్స్తాగ్రామ్ ద్వారా పంచుకుంటున్నారు.