Site icon syeraa

అగ్ర హీరోలకు తల్లిగా నటించడానికి కూడా నేను రెడీ

ఒక్కపుడు మోడల్‌గా అదేవిధంగా హీరోయిన్ గా చేసి తరువాత రేణు దేశాయ్ కొన్నేళ్ల క్రితం పూణేకు వెళ్లి తర్వాత చిత్ర దర్శకత్వం వహించారు. గత రెండు నెలలుగా, రేణు నటన గురించి అనేక ఊహాగానాలు వచ్చాయి. ఇప్పుడు టాలీవుడ్ లో నటించడానికి కూడా ఆమె సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

తాజాగా ఇప్పుడు ఒక తెలుగు టీవీ ఛానెల్‌కు ఇచ్చిన తన తాజా ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ అద్భుతమైన ప్రకటన చేశారు. తన నటన పున ప్రవేశం కోసం తాను ఎదురుచూస్తున్నానని, మహేష్ బాబు, ప్రభాస్ వంటి అగ్ర తారలకు తల్లిగా నటించడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని ఆమె అన్నారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మహేష్ మరియు ప్రభాస్ ఇద్దరూ రేణు కంటే పెద్దవారు. ఇక్కడ తెలుగు చిత్రనిర్మాతల గురించి మాట్లాడుతూ, మన దర్శకులు, నిర్మాతలు తన పాత్రను చాలా పద్ధతిగా బలంగా డిజైన్ చేస్తారని నమ్ముతున్ననని అంతే గాని తను ప్రత్యేకంగా తల్లి పాత్రను పోషించడంలో తనకు ఎలాంటి కోరిక లేదని నవ్వుతూ చెప్పారు. చూడాలి మరి రేణు దేశాయ్ గారు ఎటువంటి క్యారెక్టర్ తో రీ ఎంట్రీ ఇస్తారో దర్శక నిర్మాతలే నిర్ణయించాలి మరి.

Exit mobile version