Site icon syeraa

చిరు ఆచార్య మూవీ లో స్పెషల్ సాంగ్ లో రెజీనా

మెగాస్టార్ మూవీ లో ఐటమ్ సాంగ్ అంటే మూవీకే ఒక స్పెషల్ అట్రాక్షన్ సాంగ్ గా వుంటుంది. చిరు నటించిన అన్నయ్య మూవీ లో సిమ్రాన్ అయినా, స్టాలిన్‌లో అనుష్క అయినా, ఖైదీ నెం 150 లో లక్ష్మీ రాయ్ అయినా, చిరంజీవి ఎప్పుడూ తన డాన్స్ తో ఆశ్చర్యపోరుస్తాడు. మరోసారి అదే డాన్స్ చేయడానికి ఇప్పుడు రెజీనా కాసాండ్రా తో కలిసి చేయనున్నారు.

రెజీనా’ఆచార్య’ మూవీలో ఈ ఐటెమ్ సాంగ్ చేస్తున్నారు, దీనిని ఐటెమ్‌గా పిలవడానికి ఆమె నిరాకరించింది, కానీ దీనిని ‘సెలబ్రేషన్ సాంగ్’ అని పిలుస్తారు అని చెప్పుకొచ్చింది. ఈ చిత్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక సెట్‌లో ఆరు రాత్రులు చిత్రీకరించాము. అని చెప్పుకొచ్చింది. చిరు సార్‌తో డాన్స్ చేయడం అంత సులభం కాదు, కానీ నేను చాలా ఎక్స్‌ప్రెసివ్‌గా చేసాను, డ్యాన్స్ బాగా చేశానని చిరు సార్ ప్రశంసించినప్పుడు, నాకు చాలా సంతోషాన్ని కలిగించింది రెజీనా చెప్పుకొచ్చింది.

ఇలాంటి స్పెషల్ సాంగ్ చేయడం అనేది ఇదే నా మొదటి పాట మరియు చివరిది కూడా. ఇది మెగాస్టార్ చిరంజీవి గారి పాట కావడంతో నేను దీనికి నో చెప్పలేదు “. చిరు సార్ ఎప్పుడూ సెట్స్‌లో ఉండటం చాలా ఆనందంగా ఉందని, రెజీనా చెప్పు కొచ్చారు.

Exit mobile version