Site icon syeraa

తుది షెడ్యూల్ కోసం యూరప్ వెళ్ళుతున్న మాస్ మహా రాజ?

శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ మహా రాజ రవితేజ రామారావు ఆన్‌ డ్యూటీ చిత్ర బృందం తుది షెడ్యూల్ కోసం యూరప్ వెళ్ళడానికి సిద్ధమవుతోంది. కొన్ని భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు, మరికొన్ని యాక్షన్ సీన్స్ చిత్రీకరించడానికి అలాగే యూరప్‌లోని కొన్ని సుందరమైన ప్రదేశాలలో పాటలు చిత్రీకరణ కోసం ఈ బృందం వెల్లుతునట్లు సమచారం. రవితేజ ఈ సినిమాలో ఒక గవర్నమెంట్ అధికారి పాత్రలో కనిపించబోతున్నారు. దివ్యాంశ కౌశిక్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో నాజర్, నరేష్, పవిత్ర లోకేష్, రాహుల్ రామకృష్ణ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఆర్టీ టీమ్ వర్క్స్ సమర్పణలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై చెరుకూరి సుధాకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Exit mobile version