Site icon syeraa

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

మాస్ మహారాజ్ రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఖిలాడీ. ఫిబ్రవరి 11న ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతున్న తెలిసిందే. దీనితో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్రంలో రవితేజకి జోడిగా డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ముందుగానే చూసిన ప్రముఖలు మాటలు బట్టి చూస్తే ఈ చిత్రంలో ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ చూస్తే రవి తేజ అభిమానులకు పండుగ అనే తెలుస్తోంది. ఇందులో రవి తేజ నటన డైలాగ్స్ అద్భుతం గా ఉన్నాయి అని తెలుస్తోంది.భారీ అంచనాలతో వస్తున్న ఖిలాడీ చిత్రం మరో రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.ఈ రోజు సాయంత్రం 6 గంటలకు పార్క్ హయాత్ హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.

Exit mobile version