మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఒక ప్రముఖ ఫిల్మ్ మ్యాగజైన్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడరు చరణ్. తనకి స్పోర్ట్స్ డ్రామా తరహాలో చిత్రం చేయాలనుకుంటున్నాను అని వెల్లడించాడు.
ఆ ఇంటర్వ్యూలో చరణ్ ఇలా అన్నారు నేను మంచి స్పోర్ట్స్ డ్రామాలో నటించాలనుకుంటున్నాను. వాస్తవానికి, నేను చాలా కాలం క్రితం ఆర్‌బి చౌదరి గారి నిర్మాణంలో ‘మేరుపు’ అనే స్పోర్ట్స్ డ్రామాపై సంతకం చేశాను. కానీ వివిధ కారణాల వల్ల ఆ చిత్రం ఆగిపోయింది. అప్పటి నుండి నేను స్పోర్ట్స్ డ్రామా కథ కోసం వెతుకుతున్నాను, కానీ నాకు ఇప్పటివరకు స్క్రిప్ట్స్ రాలేదు, అని చరణ్ అన్నారు. దీని బట్టి చరణ్ తప్పకుండా స్పోర్ట్స్ డ్రామా చిత్రం చెయ్యడం కాయం అని తెలుస్తుంది.
రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌలి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్నారు. మరి కొద్ది నెలల్లో తిరిగి షూటింగ్ ప్రారంభంకానుంది. అన్ని కుదిరితే వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రం తెరపైకి తీసుకురావాలని ఈ చిత్ర బృందం భావిస్తుంది.
