Site icon syeraa

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అడిగిన బర్త్ డే గిఫ్ట్ ఇదే

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ రోజు తన 35వ పుట్టినరోజు జరుపుకుంటున్న చరణ్ ఈసారి బర్త్ డే వేడుకలు చెయ్యవదు అని మెగా ఫ్యాన్స్ ని ట్విట్టర్ ద్వారా వేడుకున్నాడు. నిన్నటి నుండి వేలాది మంది అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలతో మెగా పవర్‌స్టార్‌ను ట్విట్టర్ ద్వారా ఇన్స్ట ద్వారా విష్ చేస్తున్నారు.

ఈ అభిమానం చూసి రామ్ చరణ్ ఈ ఉదయం ట్విట్టర్‌ ద్వారా తన అభప్రాయాన్ని ఈ విధంగా పంచుకున్నారు. అర్ధరాత్రి నుంచి తనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపినందుకు తన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. చరణ్ తన ట్వీట్‌లో ఒక ముఖ్యమైన సందేశాన్ని కూడా జోడించారు. మీ అందరి నుండి నేను ఇష్టపడే ఒకే ఒక బహుమతి ఉంది. దయచేసి, లాక్డౌన్ ముగిసే వరకు దయచేసి ఇంట్లో ఉండండి! మీరందరూ నాకు ఇవ్వగల ఉత్తమ బహుమతి ఇదే! అని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

Exit mobile version