Site icon syeraa

రామ్ చరణ్ శంకర్ మూవీ తర్వాత ఈ దర్శకుడుతో చేయబోతున్నారు ?

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే అలాగే త్వరలో ఆచార్య షూటింగ్ కూడా చిన్న చిన్న భాగాలు మిగిలి ఉండగా అది కూడా పూర్తి కానుంది. అలాగే శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ తన తదుపరి చిత్రానికి సంతకం చేసిన విషయం తెలిసిందే ఈ చిత్రం సెప్టెంబర్ 8 నుండి ప్రారంభమవుతుంది. ఈ చిత్రం 2023 ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. షూటింగ్ మొత్తం తొందరగా పూర్తి చేస్తానని శంకర్ హామీ కూడా ఇచ్చారు. ఈ మూడు చిత్రాలు తర్వాత రామ్ చరణ్ తన తదుపరి చిత్రం కోసం వివిధ దర్శకులతో చర్చలు జరుపుతున్నాడు అనే వార్త ప్రచారంలో వుంది. ఇప్పుడు అది నిజం కాబోతుంది అని తెలుస్తుంది అతని 16 వ చిత్రం లాక్ చేయబడిందని ఉహాగానాలు వినిపిస్తున్నాయి . జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తన 16 వ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడు అని ఈ ప్రాజెక్ట్ ఇటీవల లాక్ చేయబడింది అని సమాచారం ఎన్వి ప్రసాద్ అలాగే రామ్ చరణ్ సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను నిర్మిస్తారు అని తెలుస్తుంది. దర్శకుడు గౌతమ్ ప్రస్తుతం హిందీ జెర్సీ పూర్తి చేసేసారు. ఈ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. అతను ప్రస్తుతం రామ్ చరణ్ స్క్రిప్ట్ కోసం పని చేస్తున్నాడు అని తెలుస్తుంది. రామ్ చరణ్ వచ్చే ఏడాది గౌతమ్ ప్రాజెక్ట్ ప్రారంభిస్తాడు అని తెలుస్తుంది. ఈ విషయాన్ని సరైన సమయంలో అధికారిక ప్రకటన ద్వారా తెలియ జేస్తారు అని తెలుస్తుంది. చరణ్‌తో గౌతమ్ చాలా కాలంగా చర్చలు జరుపుతున్నాడు అనే విషయం బాగా వినిపించింది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లాక్ చేయబడింది అనే టాక్ తెలుగు ఫిల్మ్ ఇంస్ట్రీలో బాగా వినిపిస్తుంది.

Exit mobile version