స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కొద్ది రోజుల క్రితం జార్జియాలో జరిగిన ప్రభాస్ 20 షూట్ ను పూర్తి చేసుకుని ఇప్పుడు ఇండియా కి తిరిగి వచ్చింది. కొరోనావైరస్ వ్యాప్తి దృష్ట్యా, జార్జియా లో షూటింగ్ సమయంలో తమ చేతులను క్రమం తప్పకుండా శుభ్రపరచడం, ఫేస్ మాస్క్‌లు ధరించడం మరియు ఇతర యూనిట్ సభ్యుల నుండి సురక్షితమైన దూరాన్ని నిర్వహించడం వంటి తీవ్రమైన జాగ్రత్తలు తీసుకున్నాము అని పూజా వెల్లడించింది.
పూజా హెగ్డే ప్రభాస్ 20 చిత్రం గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఇది అందమైన ప్రేమకథ చిత్రం అవుతుంది అని. ఇది పిర్యోడిక్ ఫిల్మ్ అయినప్పటికీ, రొమాన్స్ సీన్స్ చాలా ఫ్రెష్ గా వచ్చాయి , అని పూజా అన్నారు, ఇంకా చాలా ప్రదేశాల్లో షూట్ చేయవలసి వచ్చినా కరోనా వ్యాప్తి అధికంగా వుండటం తో విరమించికోవల్సి వచ్చింది అని అన్నారు. నిర్మాతలు తదుపరి ప్రదేశంలో షూట్ చేయడం ఇంకా షెడ్యుల్ కరారు కాలేదు అని పూజా చెప్పు కొచ్చారు.
