Site icon syeraa

సమంత ఇంట్లోకి మరో కుక్క పిల్ల దానిపేరు సాష

నటి సమంతకు కుక్క పిల్లలు అంటే ఎంత ఇష్టమో తను సోషల్ మీడియాలో పెట్టే వీడియోల ద్వారా తెలుస్తోంది.
సామ్‌కు ఆ కుక్కలంటే చచ్చేంత ప్రేమ. వీటిని అత్యంత ప్రేమగా, అపురూపంగా చూసుకుంటారు. సామ్‌, నాగ చైతన్య ఇద్దరు వాటికి హానీ కలగకుండా కంటికి రెప్పలా జాగ్రత్తగా పెంచుకుంటారు. ఎక్కడికి వెళ్లిన తమ వెంట ఇవి ఉండాల్సిందే. లాక్‌డౌన్‌ కారణంగా ఖాళీ సమయం దొరకడంతో ఈ రెండు కుక్కలతో ఎంజాయ్‌ చేస్తున్నారు. వీటితో సరదాగా గడుపుతూ ఆ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటారు. మరి సమంత పెంచుకునే కుక్కలా పేర్లు తెలుసుకోవాలి అనే ఆసక్తి ఉంటుంది.హాష్‌, డ్రోగో అనే రెండు కుక్కలు ఉన్నాయి ఇప్పుడు మరో కుక్క పిల్లను తెచ్చుకుంది సామ్ దాని పేరు సాష. సోషల్ మీడియా ఇన్స్తా గ్రామ్ ద్వారా ఈ విషయాన్నీ తెలియజేశారు సమంత అక్కినేని.

Exit mobile version