Site icon syeraa

కల్యాణ్ దేవ్ బర్త్ డే కానుక గా కిన్నెరాసాని థీమ్ వీడియో

కల్యాణ్ దేవ్ హీరోగా రాబోయే రొమాంటిక్ థ్రిల్లర్ కిన్నెరాసాని చిత్రం నుంచి థీమ్ మ్యూజికల్ వీడియోను రామ్ చరణ్ విడుదల చేసారు సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా. అదే విధంగా ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న కళ్యాణ్ దేవ్ కి శుభా కాంక్షలు తెలిపారు. కిన్నెరాసాని థీమ్ మ్యూజికల్ వీడియో చూస్తు వుంటే ఈ చిత్రం పై మరింత ఆసక్తి తీసుకువచ్చారు. ఒక యువతి ఛాయాచిత్రం కిన్నెరాసాని అనే పుస్తకం ఉత్సుకత స్థాయిలను రేకెత్తిస్తుంది. యువ సంగీత స్వరకర్త మహతి సాగర్ బ్యాక్ డ్రాప్ స్కోరు ఈ థీమ్ వీడియో కి ప్రధాన హైలైట్ గా ఉంది. అయితే మలయాళ యువ నటి ఆన్ షీటల్ కిన్నెరసానితో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నట్లు దాదాపుగా ఖాయం అయినట్లు తెలుస్తోంది. రమణ తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, రజనీ తల్లూరి, రవి చింతల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Exit mobile version