ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్ పి బాలసుబ్రమణ్యం గారి ఆరోగ్యం బాగుందనే మంచి వార్త వచ్చింది. చాలా మంది అభిమానుల నిరంతరాయ ప్రార్థనలు వాటి ప్రభావాన్ని చూపించాయి. ఎస్ పి బాలు గారికి కరోనా టెస్ట్ లో నెగటివ్ వచ్చిందనే శుభవార్త ఇప్పుడు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తోంది. ఆయనకు కరోన పాజిటివ్ అని ఆగస్టు 5 న ఎంజిఎం హెల్త్‌కేర్ ఆసుపత్రిలో చేర్చారు.
ఎస్ పి చరణ్ తన తండ్రి కి కోవిడ్ -19 పరీక్షలు నిర్వహించారు అని అందులో నెగటివ్ అని వచ్చిందని అతని పరిస్థితి స్థిరంగా ఉందని సోషల్ మీడియా లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి వీటిని నమ్మదు అని ఎస్పీ చరణ్ తాజా ఫేస్ బుక్ వీడియోలో వెల్లడించారు. ఇంకా, బాలు గారిని ఐసియు లోనే ఉన్నారు అని తెలిపారు. ఎంజిఎం హెల్త్‌కేర్ అధికారులు విడుదల చేసిన తాజా ఆరోగ్య బులెటిన్ కూడా ప్రస్తుతానికి బాలు గారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని చెప్పారు.
SP Charan Clarifies on the rumours surrounding SPB ‘s Health Status. Says the legendary singer is stable but continues to be on ventilator #SPBalasubrahmanyam@spp_media pic.twitter.com/5iyKDKvG8U
— Priya – PRO (@PRO_Priya) August 24, 2020
