Site icon syeraa

మండల్ రెవెన్యూ ఆఫీసర్‌గా మాస్ మహారాజ రవి తేజ?

మాస్ మహారాజ రవి తేజ 68 వ చిత్రం కథ పై ఎంతో ఆసక్తి నెలకొంది అభిమానులందరికీ, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ యాక్షన్ డ్రామా కథ కు సంబందించి కొన్నేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం కథ ఉంటుందని సమచారం. ఇటీవల విడుదలైన షూట్ ప్రకటన పోస్టర్‌లో రవితేజ ప్రభుత్వ కార్యాలయంలో కూర్చున్నారు, ఈ నేపథ్యంలో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కార్యాలయం యొక్క సైన్ బోర్డు ఉంది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రంలో రవితేజను ఒక సిన్సియర్ మండల్ రెవెన్యూ ఆఫీసర్‌గా (ఎంఆర్‌ఓ) ఉండబోతునట్లు తెలుస్తోంది. రవితేజ తన విధులను నెరవేర్చడానికి ఎంత దూరమైనా వెళ్ళడానికి వెనుకాడని నిజాయితీగల ప్రభుత్వ ఉద్యోగి పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. శరత్ మాండవ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మాజిలి నటి దివ్యన్షా కౌశిక్ ప్రముఖ కథానాయక పాత్రలో నటిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి ఈ ప్రాజెక్టు నిర్మాతగా చేస్తున్నారు.

Exit mobile version