Site icon syeraa

తెలుగు చిత్ర పరిశ్రమలో తన 45 సంవత్సరాల మైలురాయి

లెజెండరీ యాక్టర్ డైలాగ్ కింగ్, సీనియర్ నటుడు హీరో, సీనియర్ విలన్, చిత్రనిర్మాత మోహన్ బాబు గారు ఈ రోజు తెలుగు చిత్ర పరిశ్రమలో తన 45 సంవత్సరాల మైలురాయి ప్రయాణాన్ని పూర్తి చేశారు. ఈ ప్రత్యేక రోజున అభిమానులు సినీ ప్రముఖులు అభిమానుల నటుడికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపుతున్నరు. మోహన్ బాబు గారు హీరోగా నటించిన మొదటి చిత్రం ‘స్వర్గం నారకం’, అతని గురువు గారు అయిన దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించారు, 1975 లో విడుదలైంది.
మద్రాసుకు వెళ్ళిన తరువాత, మోహన్ బాబు గారు మొట్టమొదట 1974 లో కన్నవారి కలలు మరియు అల్లూరి సీతారామరాజు పాత్రలలో నటించారు. ప్రధాన నటుడిగా ఆయనకు చాలా పెద్ద గ్యాప్ తర్వాత 1975 లో స్వర్గం నారకం రూపంలో వచ్చింది. అతను అనేక సినిమాల్లో చిరస్మరణీయ పాత్రలు పోషించారు. అందులో పెదరాయుడు చిత్రంలో అతని ద్విపాత్రాభినయం అద్బుతం అనే చెప్పుకోవాలి.

మోహన్ బాబు ఇటీవలే సూర్య యొక్క ఆకాసం నీ హద్దు రా లో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించారు. అతని కొత్త చిత్రం సన్ ఆఫ్ ఇండియా వారం క్రితం ప్రారంభించబడింది.

Exit mobile version