Site icon syeraa

మెగాస్టార్‌ ది లెజెండ్‌ బుక్

మెగాస్టార్‌ ది లెజెండ్‌’ ప్రముఖుల జీవితాలు ఔత్సాహికులకు స్ఫూర్తిదాయకాలు. నిర్ధేశించుకున్న రంగంలో అత్యున్నతస్థాయికి చేరుకోవడమంటే మాటలు కాదు. మొక్కవోని దీక్ష, అంకితభావం, నిబద్ధత, క్రమశిక్షణలాంటి లక్షణాల్ని అలవర్చుకోవడంతోపాటు నిరంతరసాధన సామాన్యుల్ని సైతం అసామాన్యుల్ని చేస్తుంది. కొణిదెల శివశంకర వరప్రసాద్‌ అనే ఓ యువకుడు రంగుల ప్రపంచం పట్ల ఆకర్షితులై…అనతికాలంలోనే ఆ రంగాన్ని తనదైనశైలిలో ప్రభావితం చేసి… అభిమానుల గుండెల్లో ‘మెగాస్టార్‌’గా ప్రతిష్టింపబడడం నిజంగా ఓ సంచలనం.

చలన చిత్రరంగంలో శ్రీ చిరంజీవి అనే మెగాస్టార్‌ గురించి తెలుసుకోవాలన్న తపన, ఆసక్తి ఎంతోమందికి ఉంటుంది. నిజానికి, ఆయన వ్యక్తి కాదు… ఓ వ్యవస్థ. స్థూలదృష్టికి శ్రీ చిరంజీవి కేవలం ఓ నటుడిగానే కనిపించొచ్చు కానీ… ఆయన సమాజం పట్ల బాధ్యతెరిగిన మహామనిషి. సాటివారిపై కరుణార్థ్రదృష్టి ఆయన నైజం. మంచిగంధంలాంటి వ్యక్తిత్వం ఉన్న శ్రీ చిరంజీవి గారి జీవితాన్ని అక్షరాల్లోకి అనువదించి ‘మెగాస్టార్‌ ది లెజెండ్‌’ పేరిట 500 పేజీల అరుదైన పుస్తకం త్వరలో రాబోతోంది.

సినీ పాత్రికేయుడిగా విశేషానుభవం ఉన్న శ్రీ యు. వినాయకరావు దాదాపు మూడేళ్లుగా కష్టించి రాసిన ఈ పుస్తకం ప్రతుల్ని సొంతం చేసుకోవాలంటే… ముందుగా మీ కాపీని రిజర్వ్‌ చేసుకోండి.

Exit mobile version