Site icon syeraa

అభిమానులందరికీ ఒక ముఖ్యమైన సందేశం చిరు

ఈ రోజు ప్రపంచ రక్తదాత దినోత్సవం. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్‌ ద్వారా తన అభిమానులందరికీ ఒక ముఖ్యమైన సందేశాన్ని పంపారు.దయచేసి అందరినీ రక్తదానం చేయమని చిరు ప్రతి ఒక్కరినీ కోరారు. చిరంజీవి గారు పెట్టిన వీడియోలో మొదటి నుంచి ఇప్పటివరకూ తాను రక్తదానం చేసిన ఫొటోలతో ఈ వీడియోను చేసి పోస్ట్ పెట్టారు.

ఒకరి ప్రాణాన్ని కాపాడటం కంటే ఇంకేముంది సంతృప్తికరంగా ఉంటుంది.రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారని, చాలామంది తమ రక్తాన్ని దానం చేస్తున్నారని విని సంతోషిస్తున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమంలో భాగమవుతోన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.రక్త దానం చేయండి! ప్రాణదాతలు కండి!’ అని చిరంజీవి ట్వీట్‌ చేశారు. గత 2 దశాబ్దాలలో లెక్కలేనన్ని ప్రాణాలను రక్షించిన చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్.

Exit mobile version