మెగాస్టార్ అలాగే మెగా పవర్ స్టార్ కలసి నటిస్తున్న చిత్రం ఆచార్య ఈ చిత్ర విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు చిత్ర బృందం. ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వెవ్ అధికంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కోరటాల శివ దర్శకత్వం వహించిన ఆచార్య చిత్రానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నవేశాలను షూటింగ్ జరుపుకుంటున్నారు. మే 13 న ఈ సినిమా విడుదలకు సిద్దమవుతోంది అనే విషయం అందరికి తెలిసిందే అయితే ప్రస్తుతం ఉన్నపరిస్థితుల్లో ఈ చిత్రం వాయిదా పడింది. మళ్ళీ పరిస్థితులు సాధారణమైన స్థితికి వచ్చిన వెంటనే ఈ సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నట్లు మేకర్స్ ఈ రోజు అధికారికంగా ప్రకటించారు. ఈ ఆచార్య చిత్రంలో చిరంజీవి, రామ్ చరణ్, సోను సూద్, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే ప్రధాన నటులుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మ్యాటినీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. మనీశర్మ సంగీతం అందిస్తున్నారు.
Keeping in view of the pandemic situation, #Acharya movie will not be releasing on May 13.
New Release date will be announced once the situation becomes normal.
Wear mask, Stay home & stay safe!#AcharyaPostponed
— Konidela Pro Company (@KonidelaPro) April 27, 2021