మాస్ మహారాజ రవితేజ నటించిన ఖిలాడీ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాకి సరైన విడుదల తేదీని ఖరారు చేయడానికి వీలైనంత త్వరగా మొత్తం షూట్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు చిత్ర నిర్మాతలు. ఈ చిత్రం విడుదల తేదీని నవంబర్ 4 గా భావిస్తున్నారు అని ఉహాగానాలు వినిపిస్తున్నాయి. దీపావళి వారాంతంలో ఈ సినిమాను విడుదల చేయడం ద్వారా దీపావళి పండుగ సెలవుదినాన్ని క్యాష్ చేసుకోవాలని వారు భావిస్తున్నారు అని తెలుస్తుంది. అలాగే వరుణ్ తేజ్ చిత్రం ఘనీ కూడా దీపావళికి విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ దీపావళి పండకి ఘనీ మరియు ఖిలాడీ బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ నిస్తాయి అని తెలుస్తుంది. ప్రస్తుతం ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన అయితే లేదు.