మాస్ మహారాజ్ రవితేజ దర్శకుడు రమేష్ వర్మ తో కలిసి చేస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ఖిలాడి షూటింగ్ ముగింపు దశలో ఉన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. సత్యనారాయణ కోనేరు నిర్మించిన ఈ చిత్రంలో రవితేజ ద్వి పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో భారీ జైలు సెట్‌ను ఏర్పాటు చేస్తున్నారు చిత్ర బృందం ఇక్కడ ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించునున్నరు. ఈ చిత్రానికి సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రవితేజ కూడా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. జైలు ఎపిసోడ్లు ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు అతిపెద్ద ఆకర్షణగా ఉండనున్నాయి. బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ పెన్ స్టూడియోస్ సహకారంతో ఈ ప్రాజెక్టును నిర్మాణం చేస్తుంది. రవితేజ సరసన మీనాక్షి చౌదరి ప్రముఖ హీరోయిన్ గా, రెండవ కథానాయికగా డింపుల్ హయతి కనిపించనుంది.
In action mode with a lot of fun😉 #Khiladi pic.twitter.com/zJwLiY3CIV
— Ravi Teja (@RaviTeja_offl) December 23, 2020