మాస్ మహా రాజ రవి తేజ క్రాక్తో బ్లాక్ బస్టర్ హట్ అయిన తరువాత ప్రస్తుతం ఖిలాడిలో చిత్రంతో బిజీగా ఉన్నారు. అలాగే మరో రెండు ప్రాజెక్టులు కూడా ఉన్నాయి, వాటిలో ఒకటి శరత్ మాండవ దర్శకత్వం వహించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం కొన్ని రోజుల క్రితం అధికారిక ప్రకటన చేసిన రవితేజ శరత్ మాండవ చిత్రం మొదటి షెడ్యూల్ జరగవలసి ఉండగా పెరుగుతున్న కోవిడ్ కేసుల కారణంగా ప్రస్తుతానికి నిలిపివేయబడింది. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్, హార్స్లీ హిల్స్, చిత్తూరు, కర్ణాటకలలో దాదాపు 90 రోజులు షెడ్యూల్ పూర్తి చేయాలని అనుకున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా మజిలి నటి దివ్యన్షా కౌశిక్ సంతకం చేశారు. సుధాకర్ చెరుకూరి ఈ ప్రాజెక్టును చేస్తున్నారు. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాల త్వరలనే తెలియనున్నాయి.