Site icon syeraa

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే, అయితే బాబీ దర్శకత్వం వహిస్తున్న 154 చిత్రం పై మరింత ఆసక్తి నెలకొంది. ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ ఎంపికైంది. అయితే మరో ఇంటరెస్టింగ్ న్యూస్ ఏమిటి అంటే ఈ సినిమాలో చిరంజీవికి సోదరుడిగా మాస్ మహారాజా రవితేజ నటిస్తున్నట్లు సమాచారం. ఇంతకు ముందే రవితేజ అన్నయ్య సినిమాలో స్క్రీన్ స్పేస్‌ను పంచుకున్నారు. అయితే మరోసారి ఈ ఎనర్జిటిక్ హీరో ఏప్రిల్‌లో సెట్స్‌పైకి జాయిన్ అవుతాడని కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ వార్త గురించి ఎటువంటి అధికారిక ప్రకటన అనేది లేదు చూడాలి త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు తెలుస్తోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తుంది. ఈ చిత్రానికి సంగీతం అందించడానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌ని ఎంచుకున్నారు

Exit mobile version