Site icon syeraa

రామ్ చరణ్ అభ్యర్ధన మేరకు పుట్టినరోజు వేడుకలు రద్దు చేసిన మెగా అభిమానులు

స్టార్ హీరో రామ్ చరణ్ అభిమానులు తమ అభిమాన నటుడి పుట్టినరోజును మార్చి 26న రవీంద్ర భారతిలో ఘనంగా జరుపుకోవాలని అనుకున్నారు. ఈ వేడుకకు వి వి వినాయక్ ను, సాయి ధరమ్ తేజ్ ను,శేఖర్ మాస్టర్ ను మరి కొందరిని గెస్ట్ గా పిలవడం జరిగింది.కానీ రోజు రోజుకి కరోనావైరస్ విజృబించడంతో, ప్రభుత్వం కూడా ఈ నెల 31 వరుకు అనేక ఆకాంక్షలు పెట్టడంతో, అలాగే రామ్ చరణ్ అభ్యర్ధన మెరకు ఈవేడుక ను రద్దు చేయాలని నిర్ణించుకున్నారు.

అయితే, బాధ్యతాయుతమైన పౌరుడిగా, రామ్ చరణ్ ఒక పబ్లిక్ నోట్ విడుదల చేసి, తన పుట్టినరోజును ఈసారి జరుపుకోవద్దని అభిమానులను కోరారు. చరణ్ తన అభిమానులను అప్రమత్తంగా ఉండాలని మరియు పెద్ద బహిరంగ సభలను ఏర్పాటు చేయకుండా మరియు సురక్షితంగా ఉండడం ద్వారా వైరస్ వ్యాప్తిని నివారించడంలో అధికారులకు సహాయం చేయాలని అభ్యర్థించారు.

Exit mobile version