Site icon syeraa

స్తెరా డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్ 29 వ చిత్రమా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రం 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకొని మిగతా షూటింగ్ కరోనా వ్యాప్తి దృశ్య వాయిదా పడిన విషయం తెలిసిందే ఈ సినిమా టీజర్ గురించి పవన్ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం తరువాత పవన్ కళ్యాణ్ క్రిష్, హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో రెండు సినిమాలకు సంతకం చేసిన విషయం తెలిసిందే అయితే ఈ రెండు ప్రాజెక్ట్స్ తర్వాత అతని తదుపరి ప్రాజెక్ట్ గురించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ 29 వ చిత్రంగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు అని స్పష్టంగా వినిపిస్తుంది ఈ చిత్రాన్ని ఎస్ఆర్టి ప్రొడక్షన్స్ బ్యానర్ క్రింద పవన్ కి మంచి స్నేహితుడు అయిన రామ్ తల్లూరి నిర్మాతగా చేస్తారు అని సమాచారం. పవన్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 1 న ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది అని సమాచారం. అయితే ఈ వార్తలు నిజమో కాదో అనేది అధికారిగా ప్రకటన వచ్చేవరకు వేచి చూడాలి.

Exit mobile version