భారతీయ సినిమాకు దక్కిన గొప్ప సంగీత గాయకుడు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం గారు గత కొద్ది రోజులుగా హాస్పిటల్ లో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నదని బాలు కుమారుడు చరణ్ అలాగే చెల్లెలు ఎస్ పి శైలాజ గారు ఎప్పటి కప్పుడు సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నారు. ప్రముఖులు అందరు ఆయన తొందరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి బాలు గారు తొందరగా కోలుకుని తిరిగి రావాలని ప్రార్ధన చేస్తున్నట్టు చెప్పారు. బాలు గారి ఆరోగ్యం కోసం అందరూ ప్రార్థనలు చేయాలని కోరారు.
ఎస్ పి బాలు గారు తొందరగా కోలుకోవాలని చిరు ప్రార్ధన
