మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వచ్చిన జెంటిల్ మేన్ జూన్ 17, 2016 న తెరపైకి వచ్చింది. ఈ చిత్రంలో నాని, నివేదా థామస్, వెన్నెలా కిషోర్ అలాగే సురభి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం నాని నటన అద్భుతం అనే చెప్పాలి.ఈ చిత్రంలో నాని డబుల్ రోల్ లో పాత్రలో అద్భుతంగా నటించారు ఇప్పుడు అదే తరహా క్యారెక్టర్ తో మళ్లీ రాబోతున్నారు
నాని తన రాబోయే చిత్రం ‘వి’ లో విలన్ పాత్రలో ప్రేక్షకులను థ్రిల్ చేయబోతున్నాడు. ఈ చిత్రంలో నాని సీరియల్ కిల్లర్‌గా, సుధీర్ బాబు ఒక పోలీసు అధికారిగా నటిస్తున్నారు.సమ్మర్ రిలీజ్ కోసం ప్లాన్ చేసిన ఈ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం లాక్ డౌన్ కారణంగా లేట్ అయ్యింది దర్శకుడు మోహనా కృష్ణ ఇంద్రగంటి ఈ చిత్రాన్ని తీస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లు ఈ చిత్రానికి ప్రధాన ఆర్షణగా ఉంటాయి అని తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో ఫ్లాష్‌బ్యాక్ లో మిలిటరీ మేజర్‌గా నాని అందరినీ ఆశ్చర్యపరుస్తాడు అని సమాచారం.ఈ దృశ్యం చిత్రంలో ప్రధాన హైలైట్‌గా వుండచ్చు అంటా. ఈ చిత్రంలో నివేదా థామస్ అలాగే అదితి రావు హైడారి కథానాయికలుగా నటిస్తున్నారు రాజు నిర్మాత ఈ చిత్రం యొక్క అధికారిక విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు
