Site icon syeraa

ఎఫ్3 మూవీ లో హీరోలు ఎవరూ?

ఎఫ్2 సూపర్ సక్సెస్ తరువాత, అనిల్ రవిపుడి,దిల్ రాజు ఈ చిత్రానికి సీక్వెల్ వుంటుంది అని అప్పుడు సక్సెస్ మీట్ లో ప్రకటించారు.అయితే అనిల్ రవిపుడి ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ కోసం పని చేస్తున్నారు అని తెలుస్తోంది.వెంకటేష్ వరుణ్ తేజ్ పాత్రలను తిరిగి ఎఫ్3 లో కూడా వుంటాయ అని ఒక ప్రశ్న? ఇతర నటులు స్క్రిప్ట్ పూర్తయిన తర్వాతే లాక్ చేస్తారు.

ఎఫ్2 సూపర్ సక్సెస్ తరువాత, వెంకీ తన ఫీజును పెంచారు అని టాక్. నిర్మాత దిల్ రాజుతో ఎఫ్3 కోసం రూ .10 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. వెంకటేష్‌కు బదులుగా రవితేజ పేరును దిల్ రాజు సజెస్ట్ చేస్తున్నట్లు ఒక టాక్.

ఎఫ్2 విజయానికి కారణం వెంకీ అని ఆ పాత్ర వెంకటేష్ అయితేనే బాగుటుందని అనిల్ రావిపూడి అభిప్రాయ అంటా. స్క్రిప్ట్ వర్క్ ముగిసిన తర్వాత దిల్ రాజు మరియు అనిల్ ప్రధాన నటుల గురించి తెలియ జేస్తరు.ఎఫ్3 రెగ్యులర్ షూట్ ఈ సంవత్సరం జూన్ నుండి ప్రారంభమవుతుంది మరియు సంక్రాంతి 2021 కి విడుదల అవుతుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

Exit mobile version